విశాఖ మన్యంలో డోలీ మోతలు ఆగడం లేదు. పాడేరు మండలం మినుములూరు పంచాయతీ గాలిపాడులో ఆరునెలల గర్భిణీ పురిటి నొప్పులతో విలవిల్లాడింది. రహదారి సక్రమంగా లేకపోవటంతో....అంబులెన్స్ మార్గ మధ్యలోనే ఉండిపోయింది. రెండు కిలోమీటర్లు మేర డోలీలో కొండల గుండా మోసుకొచ్చి అంబులెన్స్ పై మినుములూరు ఆసుపత్రికి తరలించారు. అయితే బిడ్డ మృతి చెంది ఆమెకు అబార్షన్ అయింది. ఏజెన్సీలో గర్భిణీలు తగు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో... ఇలాంటి ముందస్తు అబార్షన్లు అవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.
ఆగని డోలీ మోతలు...ముందస్తు ప్రసవమై బిడ్డ మృతి - pregnent woman problems in visakha manyam
మన్యంలో నెలలు నిండిన గర్భిణులను ప్రసవం కోసం ఆసుపత్రికి తరలించేందుకు డోలీ మోతలు తప్పడం లేదు. తాజాగా ఆరు నెలల గర్భిణీకి పురిటి నొప్పులు రావటంతో డోలీలో రెండు కిలోమీటర్లు మోసి ఆసుపత్రికి తరలించిన...ముందస్తు ప్రసవమై బిడ్డ మృతి చెందిన ఘటన విశాఖ మన్యంలో చోటుచేసుకుంది.
విశాఖ మన్యంలో గర్భిణీల అవస్థలు