విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి చెందకుండా గిరిజనులకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. జి.మాడుగుల మండలం జోగులపుట్టులో ఎస్సై.. మన్యం వాసులకు కరోనా వ్యాధి నివారణ, మాస్కులు ఉపయోగం, చేతులు శుభ్రత, భౌతిక దూరంపై వివరించారు. అనంతరం గ్రామస్థులు, పారిశుద్ధ్య కార్మికులు, జీసీసీ కలాశీలకు.. సీఆర్పీఎఫ్ 198 బెటాలియన్, ఎఫ్ కంపెనీ ఎస్సై ఉపేంద్ర, ఓసి శర్మ కలిసి 1000 మాస్కులు, 750 సబ్బులు, 60 శానిటైజర్లు అందజేశారు. ఆపదకాలంలో ఆదుకుంటున్న పోలీసులకు గిరిపుత్రులు కృతజ్ఞతలు తెలిపారు.
విశాఖ మన్యంలో గిరిజనులకు మాస్కుల పంపిణీ - సిఆర్పిఎఫ్ బెటాలియన్
విశాఖ ఏజెన్సీలో కరోనా నివారణపై పోలీసులు గిరిజనులకు అవగాహన కల్పిస్తున్నారు. సీఆర్పీఎఫ్ 198 బెటాలియన్ సిబ్బందితో కలిసి ఓసీ శర్మ అక్కడి వారికి మాస్కులు, సబ్బులు, శానిటైజర్లు అందజేశారు.
గిరిజనులకు 100 మాస్కులు పంపిణీ చేసిన పోలీసులు