ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇళ్ల పట్టాల పంపిణీలో ఏర్పాటు చేసిన శిలాఫలకం ధ్వంసం - విశాఖపట్నం తాజా సమాచారం

విశాఖపట్నం జిల్లాలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు, పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

plaque Vandalized
శాలాఫలకం ధ్వంసం

By

Published : Jan 4, 2021, 11:44 AM IST

ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన శంకుస్థాపన శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటన విశాఖపట్నంలోని పాయకరావుపేట మండలం ఎస్. నర్సాపురం గ్రామంలో జరిగింది. ఈ ఫలకాన్ని స్థానిక ఎమ్మెల్యే బాబూరావు శనివారం ప్రారంభించారు. ఫలకం ధ్వంసం విషయం తెలుసుకున్న రెవెన్యూ, పోలీసు అధికారులు గ్రామంలోకి వెళ్లి ఘటనపై ఆరా తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details