రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల పనితీరును నిరంతరం తనిఖీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటి సేవల నాణ్యత పర్యవేక్షణకు ప్రత్యేక యాప్ను రూపొందించింది. ఈ యాప్ ఆధారంగా అంగన్వాడీలకు రేటింగ్ ఇవ్వనుంది. దీనికోసం 14 అంశాలను ఎంపిక చేసి... అమలు చేయనున్నారు. ఫ్రీ స్కూల్ విధానాన్ని యాప్ ద్వారానే తనిఖీ చేయనుంది. ఇప్పటికే సిద్ధం చేసిన మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు... కేంద్రాల పున: ప్రారంభం తర్వాత ఈ ప్రక్రియ అమలులో రానుంది.
ఎంపిక చేసిన 14 అంశాలు పాలు, గుడ్ల నాణ్యత, మధ్యాహ్న భోజన పథకం ప్రధానంగా తీసుకోనున్నారు. తాగునీటి సౌకర్యం, వంటగది, వస్తువులను నిల్వ ప్రదేశం, వినియోగించే పదార్థాల నాణ్యత పరిణామం, పరిశుభ్రత వంటి ఇతర అంశాలకు మార్కులు కేటాయిస్తారు. 40 శాతం కంటే తక్కువ నమోదయితే సమస్యను 15 రోజుల్లోగా పరిష్కరించాలి. లేనిపక్షంలో పైస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లేలా రూపొందించారు.