ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంత్రి, ఎమ్మెల్యేలకు ఆ నిబంధన వర్తించదా? - social distance

కరోనా వ్యాప్తి చెందకుండా స్వీయరక్షణ, సామాజిక దూరం పాటించడమే నివారణ అంటూ అధికారులు ప్రచారం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ నిబంధనను ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకున్నట్లు కనిపించడం లేదు.

The people who attended the Chodaram House were huge
చోడవరం సభకు భారీగా హాజరైన ప్రజలు

By

Published : Mar 31, 2020, 10:40 AM IST

Updated : Mar 31, 2020, 11:40 AM IST

చోడవరం సభకు భారీగా హాజరైన అధికారులు, సిబ్బంది

విశాఖ జిల్లా చోడవరంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ కొవిడ్-19 పై నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. అనకాపల్లి ఎంపీ డా.సత్యవతి, చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ , సంబంధిత అధికారులు, వైద్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఓ ప్రైవేట్ కల్యాణ మండపం వేదికగా జరిగిన ఈ సభకు భారీ సంఖ్యలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సమావేశ మందిరం చిన్నది కావడంతో సభకు వచ్చిన వారందరూ గుంపులుగా గుమికూడారు. ఫలితంగా ప్రభుత్వం ప్రచారం చేస్తున్న సామాజిక దూరం అనే నిబంధనకు గండి పడినట్లయింది.

Last Updated : Mar 31, 2020, 11:40 AM IST

ABOUT THE AUTHOR

...view details