ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రమాదకర స్థాయికి పెద్దేరు జలాశయం నీటి మట్టం.. - విశాఖ జిల్లాపై నివర్ తుపాన్ ప్రభావం

నివర్ తపాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు విశాఖ జిల్లా పెద్దేరు జలాశయం నిండింది. ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు 259క్యూసెక్కుల నీరు నదిలోకి వదులుతున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థిని పర్యవేక్షిస్తున్నారు.

The pedderu reservoir was flooded by rains
ప్రమాదకర స్థాయికి పెద్దేరు జలాశయం

By

Published : Nov 27, 2020, 4:14 PM IST

విశాఖ జిల్లా మాడుగుల మండలం పెద్దేరు జలాశయం నిండుకుండను తలపిస్తోంది. ఇప్పటికే నీటితో కళకళలాడుతున్న జలశయంలోకి ఎగువ ప్రాంతం నుంచి 71 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. దాంతో మొత్తం 137మీటర్లున్న పెద్దేరు పూర్తి స్థాయి నీటిమట్టం.. ప్రస్తుతం 136.40 మీటర్ల గరిష్టస్థాయికి చేరుకుంది. ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు స్పిల్ వే గేట్లు ఎత్తి 259 క్యూసెక్కులను నదిలోకి వదులుతున్నారు.

నివర్ తుపాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో అధికారులు అప్రమత్తమై ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఆయకట్టుకు సాగునీటిని నిలిపివేసినట్లు జలాశయం ఏఈ సుధాకర్ రెడ్డి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details