స్వచ్ఛత ప్రచారంలో భాగంగా నౌకాదళ సిబ్బంది, విద్యార్ధి బృందం.. విశాఖ నుంచి విజయనగరం వరకూ వంద కిలోమీటర్ల సైకిల్ యాత్రను నిర్వహించింది. విశాఖలోని ఐఎన్ఎస్ విశ్వకర్మ నుంచి విజయనగరం జిల్లా కోరుకొండ సైనిక స్కూల్ వరకు వెళ్లి సైకిల్ యాత్ర జరిగేలా రూపొందించారు. రియర్ అడ్మిరల్ దీపక్ కపూర్ ఈ ర్యాలీని తూర్పు నౌకాదళం నుంచి ఆరంభించారు. స్వచ్ఛత ప్రాధాన్యత, బాధ్యతలను గుర్తు చేయడమే కాకుండా తీరం వెంబడి సాగరాన్ని పరిశుభ్రం చేసే పనిని కూడా ఈ బృంద సభ్యులు చేపట్టారు. 72 మంది బృందం సైకిళ్లతో ఈ దూరాన్ని పూర్తి చేశారు. విశాఖ నుంచి బయలు దేరి సింహాచలం, పద్మనాభం మీదుగా కోరుకొండకు వచ్చి తిరిగి భీమిలి రుషికొండ మీదుగా తూర్పు నౌకా దళానికి చేరుకున్నారు.
'స్వచ్ఛత కోసం నౌకాదళ, విద్యార్థి బృందం సైకిల్ యాత్ర' - స్వచ్ఛత కోసం నౌకాదళ సిబ్బంది సైకిల్ యాత్ర
స్వచ్ఛత ప్రాధాన్యతను, బాధ్యతలను గుర్తు చేయటమే లక్ష్యంగా.. నౌకాదళ సిబ్బంది విశాఖ నుంచి విజయనగరం వరకూ సైకిల్ యాత్ర నిర్వహించారు. 70 మంది సభ్యుల బృందం సైకిళ్లతో వంద కిలోమీటర్ల దూరాన్ని చేరుకున్నారు.
స్వచ్ఛత కోసం... సైకిల్ యాత్ర
TAGGED:
cycle rally