తల్లి మందలించిందని ఓ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించిన ఘటన విశాఖ ఏజెన్సీలో చోటుచేసుకుంది. అల్లంపుట్టుకు చెందిన బాలిక పెదగరువు గిరిజన సంక్షేమ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. వారం క్రితం స్వగ్రామం వచ్చిన బాలికి పాఠశాలకు వెళ్లనని మారాం చేసింది. దీంతో తల్లి మందలించి వసతిగృహానికి పంపింది. మనస్థాపానికి గురైన బాలిక ఇంజక్షన్ సీసాలోని మందును తాగింది. అపస్మారక స్థితిలోకి చేరుకున్నబాలికను వసతిగృహం సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
తల్లి మందలించిందని...తనువు చాలించాలనుకుంది ! - విశాఖలో విద్యార్థిని అత్మాహత్యాయత్నం
తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక పాఠశాలకు వెళ్లనని మారం చేయటంతో తల్లి మందలించింది. దీంతో మనస్థాపానికి గురైన బాలిక ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన విశాఖ ఏజెన్సీలో చోటుచేసుకుంది.
తల్లి మందలించిందని...తనువు చాలించాలనుకుంది !