ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సాగునీటి వనరుల అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే ముత్యాలనాయుడు - విశాఖ జిల్లా వార్తలు

విశాఖ జిల్లా దేవరాపల్లి మండలంలోని గ్రామాలలో చెరువుల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి, పనులు ప్రారంభించారు. సాగునీటి వనరుల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు అన్నారు.

vishaka district
సాగునీటి వనరుల అభివృద్ధికి కృషి: విప్

By

Published : Jul 22, 2020, 10:10 PM IST

విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం ముసిడిపల్లి, తెనుగుపూడి, కె.ఎం.పాలెం, ఎ. కొత్తపల్లి గ్రామాల్లో చెరువుల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు శంకుస్థాపన చేసి, పనులు ప్రారంభించారు. జపాన్ బ్యాంక్ వారి సహకారంతో రూ.2.26 కోట్లతో పనులు చేపట్టిన్నట్లు తెలిపారు.

వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పెద్ద పీట వేసిందన్నారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. మాడుగుల నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న సాగునీటి వనరుల పనులు పూర్తి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో జలవనరుల శాఖ అధికారులు, వైకాపా నేతలు పాల్గొన్నారు.

ఇదీ చదవండివైద్యం, మౌలిక సదుపాయాలు లేక కొవిడ్ బాధితుల అవస్థలు

ABOUT THE AUTHOR

...view details