విశాఖ జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. జిల్లాలోని పాడేరు, చీడికాడ, దేవరపల్లి, హుకుంపేట, అనంతగిరి, వేపాడ, లక్కవరపుపేట ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. రైతులు, కూలీలు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని మంత్రి కన్నబాబు తెలిపారు.
వర్షసూచన...
ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రలో మూడు రోజులపాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ.. ఎల్లుండి దక్షిణ కోస్తాంధ్రలో ఒక ట్రెంటు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
ఇదీ చదవండి:
'నీళ్లు పుష్కలంగా ఉన్నప్పుడు విద్యుదుత్పత్తి చేసుకోండి'