విశాఖ మన్యంలో కొండ వాగు దాటుతూ ఓ వ్యక్తి కొట్టుకుపోయి మృతి చెందాడు.పెదబయలు మండలం కూతంగిపుట్టులో శనివారం సాయంత్రం మత్యగడ్డ దాటుతూ గల్లెల చిన్నయ్య (58) కొట్టుకుపోయాడు. వరద ఉద్ధృతి కారణంగా బంధువులు గాలింపు చర్యలు చేపట్టలేకపోయారు. సమీపంలో ఉన్న గిరిజనులు చేపలు పడుతుండగా మృతదేహం వలలో చిక్కింది. ఘటనను కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించారు.
వాగు దాటుతూ నీటిలో కొట్టుకుపోయిన వ్యక్తి మృతి - vishaka manyam crime news
ఇటీవల కురిసిన వర్షాలకు ఎక్కడ చూసినా వాగులు, చెరువుల్లో నీరు పొంగిపొర్లుతోంది. కొంతమంది వాగులను దాటలేక అందులో చిక్కుకుపోయి మృతి చెందుతున్నారు. ఇలాంటి ఘటనే విశాఖ మన్యంలో జరిగింది. పెద్ద బయలు మండలంలోని ఓ వృద్ధుడు వాగును దాటుతూ అందులో కొట్టుకుపోయి మృతి చెందాడు.
వాగు దాటూతు నీటిలో కొట్టుకుపోయిన వ్యక్తి మృతి