ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నర్సీపట్నంలో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు - YS Rajasekhar Reddy Jayanti celebrations

విశాఖ జిల్లా నర్సీపట్నంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్.వైఎస్ రాజశేఖర్ రెడ్డి 71 వ జయంతి వేడుకలను నిర్వహించారు.

The late YS Rajasekhar Reddy Jayanti celebrations in Narsipatnam
నర్సీపట్నంలో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు

By

Published : Jul 8, 2020, 12:49 PM IST

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్.వైఎస్ రాజశేఖర్ రెడ్డి 71 వ జయంతి వేడుకలను విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ హాజరయ్యారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రాష్ట్రానికి చేసిన సేవలను ఎమ్మెల్యే కొనియాడారు. జోహార్..జోహార్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సన్యాసి పాత్రుడు కోనేటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

అచ్చెన్నాయుడు ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి.

ABOUT THE AUTHOR

...view details