ఏకధాటిగా కురిసిన వర్షాలకు జిల్లాలోని జలాశయాల్లో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఒకప్పుడు నీటి చుక్క లేని రిజర్వాయర్లు కూడా జలకళను సంతరించుకున్నాయి. రావికమతం మండలం కళ్యాణపులోవ జలాశయం... నిండుకుండలా మారి వీక్షకులకు కనుల పండుగగా ఉంది. రెండేళ్ల క్రితం వరకు అడుగంటిన జలాశయం నేడు నీటితో చూడముచ్చటగా ఉంది.
కళ్యాణపులోవ జలాశయంలో పూర్తిస్థాయి నీరు
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో జిల్లాలోని పలు జలాశయాలు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్నాయి. ఒకప్పుడు అడుగంటిన రిజర్వాయర్లు... ప్రస్తుతం కొత్త నీటితో కళకళలాడుతున్నాయి. రానున్న ఖరీఫ్ సీజన్ వరకు ఈ నీరు సమృద్ధిగా సరిపోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
కళ్యాణపులోవ జలాశయలో పూర్తీ స్థాయి నీరు
రానున్న ఖరీఫ్ సీజన్ వరకు సుమారు ఐదు వేల ఎకరాలకు నీరు అందించడంతో పాటు భూగర్భజలాలు పుష్కలంగా పెరిగాయలని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే బోరుబావులకు డోకా ఉండదని తెలిపారు. ఈ జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం నాలుగు వందల అరవై అడుగులు. నీటిమట్టాన్ని 460 అడుగులకు చేరకుండా 459 వద్ద నిలకడగా ఉంచి ఉంచుతూ అదనపు నీటిని గేట్ల ద్వారా పంపిస్తున్నారు.
ఇదీ చదవండీ...సోమశిల జలాశయంలో పడవ బోల్తా.. వ్యక్తి దుర్మరణం