లాక్డౌన్ కారణంగా మూతపడ్డ విశాఖ జిల్లా అనకాపల్లి బెల్లం మార్కెట్ తెరుచుకోవటంతో అధిక సంఖ్యలో బెల్లం దిమ్మెలు మార్కెట్‌కు చేరుకున్నాయి. బుధవారం ఒక్కరోజే 54,100 బెల్లం దిమ్మెల అమ్మకాలు జరిగాయి. వాటి విలువ మూడు కోట్ల 25 లక్షలు ఉంటుందని వ్యాపారులు తెలిపారు. మూడు విభాగాలుగా విభజించిన బెల్లానికి అధిక ధర పలకటం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బెల్లాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు గానూ ఈరోజు మార్కెట్‌ను మూసివేశారు.
అనకాపల్లి మార్కెట్‌కు భారీగా చేరుకున్న బెల్లం - అనకాపల్లి మార్కట్‌కు అధిక సంఖ్యలో చేరుకున్న బెల్లం
విశాఖ జిల్లా అనకాపల్లి బెల్లం మార్కెట్ తెరుచుకోవటంతో అధిక సంఖ్యలో బెల్లం దిమ్మెలు మార్కెట్‌కు చేరుకున్నాయి. సుమారు మూడు కోట్ల 25 లక్షల విలువైన బెల్లం లావాదేవీలు జరిగాయని వ్యాపారులు తెలిపారు.
అనకాపల్లి మార్కట్‌కు అధిక సంఖ్యలో చేరుకున్న బెల్లం
TAGGED:
Anakapalli market