ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లారీ టైర్ ఢీకొని మహిళ మృతి..! - నక్కపల్లిలో లారీ టైర్ ఢీకొని...మహిళ మృతి

విశాఖ జిల్లా నక్కపల్లి జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఓ మహిళ లారీ టైర్​ ఢీ కొని మృతి చెందింది. లారీ వేగంగా వెళ్తుండగా వాహనం నుంచి టైర్​ విడిపోయి మహిళను బలంగా ఢీ కొట్టింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

woman was killed by a lorry tire collided in Nakkapalli
లారీ టైర్ ఢీకొని...మహిళ మృతి

By

Published : Dec 17, 2019, 3:00 PM IST

లారీ టైర్​ ఢీ కొని మహిళ మృతి

విశాఖ జిల్లా నక్కపల్లిలో హైవేపై లారీ టైర్ ఢీకొని ఓ మహిళ దుర్మరణం చెందింది. నక్కపల్లికి చెందిన గింజాల సన్యాసమ్మ రోడ్డు దాటి కొళాయి వద్ద నీరు పట్టుకుని తిరిగి వస్తుండగా.. తుని నుంచి విశాఖ వైపు వెళ్తున్న లారీ నుంచి టైర్​ విడిపోయి సన్యాసమ్మని ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details