విశాఖ మన్యం కేంద్రం పాడేరు నీలకంఠేశ్వర ఆలయంలో శివుని విగ్రహ ప్రతిష్ఠ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అరకు ఎంపీ మాధవి, ఎమ్మెల్యే పాల్గుణ, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, మాజీ మంత్రి శ్రావణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, జిల్లా యూత్ తెదేపా కార్యదర్శి సుబ్బా రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు ప్రత్యేక పూజలు చేసి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. విశాఖ మన్యం ప్రజలు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రస్తుత, మాజీ ప్రజా ప్రతినిధులు ఒకేసారి కార్యక్రమానికి రావడం వల్ల వాతావరణం కోలాహలంగా మారింది . ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
పాడేరులో వైభవంగా నీలకంఠేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠ - విశాఖ మన్యం కేంద్రం పాడేరు తాజా వార్తలు
విశాఖ జిల్లా పాడేరులో నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో శివుని విగ్రహ ప్రతిష్ఠ కన్నుల పండువగా సాగింది. ప్రస్తుత, మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
పాడేరులో నీలకంఠేశ్వర ఆలయంలో శివుని విగ్రహ ప్రతిష్ట
TAGGED:
అరకు ఎంపీ మాధవి తాజా వార్తలు