విశాఖ జిల్లా సింహాచలం అప్పన్నస్వామికి చందనోత్సవం ఘనంగా జరిగింది. ప్రభుత్వం తరఫున స్వామివారికి ఆలయ ఈవో వెంకటేశ్వరరావు పట్టు వస్త్రాలు సమర్పించారు. అక్షయ తృతియ సందర్భంగా స్వామివారు భక్తులకు నిజరూపంలో దర్శనమిచ్చాడు. లాక్డౌన్ కారణంగా స్వామి దర్శనానికి భక్తులను అనుమతించలేదు. 15 మంది ఆలయ అర్చకులతో ఈ ఉత్సవాన్ని నిర్వహించారు. ఆలయ చరిత్రలోనే భక్తులను అనుమతించకుండా జరిగిన తొలి చందనోత్సవం ఇదే.
ఆ ఆలయ చరిత్రలోనే ఇలా మొదటిసారి..! - భారతదేశ ప్రధానాలయాలు
సింహాచలం అప్పన్న స్వామివారికి చందనోత్సవం ఘనంగా నిర్వహించారు. కరోనా వ్యాప్తి కారణంగా ఆలయంలోకి భక్తులను అనుమతించలేదు. భక్తులను అనుమతించకుండా జరగడం ఆలయ చరిత్రలో ఇదే తొలిసారి.
ఘనంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం