రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని... న్యాయస్థానం ఆదేశాలతో చంద్రబాబు తిరిగి విశాఖలో పర్యటిస్తారని తెదేపా నేత బండారు సత్యనారాయణ స్పష్టం చేశారు. డీజీపీ అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని, ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రశాంత విశాఖ నగరంలో విష సంస్కృతిని తీసుకువచ్చారని తెదేపా నేత భరత్ ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా పాలన ఇలాగే కొనసాగితే... రాష్ట్రానికి పెట్టుబడులు రావని స్పష్టం చేశారు.
'ప్రభుత్వం ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టాలని చూస్తోంది' - tdp leader bharat news
వైకాపా ప్రభుత్వం ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టాలని చూస్తోందని విశాఖ తెదేపా నేతలు విమర్శించారు. డీజీపీ అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు.
ప్రభుత్వం ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టాలని చూస్తుంది