విశాఖలో పెద్ద ఎత్తున భూకబ్జాలు జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శించారు. విశాఖ జిల్లాలో పర్యటించిన తెదేపా నిజనిర్ధారణ కమిటీ సభ్యులు...భూకుంభకోణాలను ప్రజలకు వివరించారు. ఎంపీ విజయసాయి రెడ్డి బినామీ పేరుతో భీమిలిలో 650 ఎకరాలు కబ్జా చేశారని కమిటీ సభ్యుడు నిమ్మల ఆరోపించారు. ఈ భూదందాలపై ప్రభుత్వం జ్యుడీషయల్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మరో సభ్యుడు నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ...విశాఖ నగరంపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. 2014 లో విజయమ్మను ఓడించిచారన్న పగతో ఇలా చేస్తున్నారని ఆరోపించారు. జరగుతున్న పరిణామాలను ప్రజలు గమనించాలని కోరారు. 8నెలలుగా నగరంలో భూదందా యథేచ్చగా సాగుతోందన్నారు.
విశాఖపై ప్రభుత్వం కక్ష పెంచుకుంది: తెదేపా - విశాఖ భూకుంభకోణంపై నక్కా వ్యాఖ్యలు
2014 లో విజయమ్మను ఓడించిచారన్న పగతోనే విశాఖ నగరంపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని తెదేపా నేతలు విమర్శించారు. నగరంలో పెద్ద ఎత్తున భూకబ్జాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
విశాఖ నగరంపై ప్రభుత్వం క్షక్షపెంచుకుంది