ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యువకుడు వేధిస్తున్నాడంటూ పోలీసులను ఆశ్రయించిన బాలిక - విశాఖలో యువకుడు వేధిస్తున్నాడని 12ఏళ్ల బాలిక ఫిర్యాదు వార్తలు

విశాఖ జిల్లా రోలుగుంట మండలం బీబీ పట్నం గ్రామానికి చెందిన బాలిక.. రోలుగుంట పోలీసులను ఆశ్రయించింది. అదే మండలానికి చెందిన యువకుడు తనను ప్రేమిస్తున్నానంటూ వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై గ్రామంలో డీఎస్పీ విచారణ చేపట్టారు.

The girl complaint to the police
బాలిక ఫిర్యాదుపై విచారణ చేపట్టిన డీఎస్పీ

By

Published : Mar 10, 2021, 11:02 AM IST

12 ఏళ్ల బాలిక ఫిర్యాదుపై అనకాపల్లి దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ విశాఖ జిల్లా రోలుగుంట మండలం బీబీ పట్నం గ్రామంలో విచారణ చేపట్టారు. బాలికను అదే మండలం రత్నం పేట గ్రామానికి చెందిన మహేష్ అనే యువకుడు కొద్దిరోజులుగా ప్రేమిస్తున్నానంటూ వేధిస్తున్నాడు. బాలిక పలుమార్లు హెచ్చరిచ్చినప్పటికీ పట్టించుకోకుండా.. తనను మానసికంగా వేధిస్తున్నాడని బాలిక రోలుగుంట పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. విచారణ చేశారు. గతంలో చోటుచేసుకున్న సంఘటనలపై ఆరా తీశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details