ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డ్రైనేజీ సమస్య... అక్కిరెడ్డిపాలెం కంపు కంపు - The drainage problem must be addressed.

విశాఖ జిల్లా గాజువాక జీవీఎంసి పరిధి అక్కిరెడ్డిపాలెం శివారు ప్రాంతంలో చెరువు పరిశ్రమ నుంచి వచ్చే రసాయనాలతో నిండిపోతోంది. దీనికి తోడు మురుగునీరు చేరి.. దుర్వాసన వెదజల్లుతోంది. ఈ కంపు భరించలేక ప్రజలు ఇబ్బందిపడుతున్నారు.

డ్రైనేజీ సమస్యతో... అక్కిరెడ్డిపాలెం వాసుల అగచాట్లు
author img

By

Published : Jul 26, 2019, 9:16 AM IST

విశాఖ గాజువాక జీవీఎంసీ పరిధిలో అక్కిరెడ్డిపాలెం వద్ద చెరువు అభివృద్ధి చేసి చేపలను పెంచుతున్నారు. విశాఖ డైరీ చెందిన మురుగు నీరు ఇక్కడకు మళ్లించారు. నీరు కలుషితమై చేపలు మృత్యువాతపడ్డాయి. ఈ దుర్వాసనకు ఈ చెరువు పరిధిలోని గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవట్లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా పరిశ్రమ నిర్వాహకులతో మాట్లాడి డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపర్చాలని కోరుకుంటున్నారు. సమస్యను పరిష్కరించని పక్షంలో చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలపై ఆందోళన దిగుతామని హెచ్చరించారుగ్రామస్తులు.

డ్రైనేజీ సమస్యతో... అక్కిరెడ్డిపాలెం వాసుల అగచాట్లు

ABOUT THE AUTHOR

...view details