ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోనాం జలాశయం నుంచి సాగునీటి విడుదల సామర్థ్యం పెంపు - Konam Reservoir latest news

విశాఖ జిల్లా చీడికాడ మండలం కోనాం జలాశయం నుంచి సాగునీటి కాలువకు నీటి విడుదల సామర్థ్యాన్ని పెంచారు. రైతుల విన్నపం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.

Konam Reservoir
కోనాం జలాశయం

By

Published : May 31, 2021, 3:21 PM IST

విశాఖ జిల్లా చీడికాడ మండలం కోనాం జలాశయం నుంచి దిగువ సాగునీటి కాలువకు నీటి విడుదల సామర్థ్యంపెంచారు. ఇప్పటివరకు దిగువ కాలువకు 20 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టేవారు. ఖరీఫ్ సీజన్ దరిచేరడంతో రైతుల విజ్ఞప్తి మేరకు.. దిగువ సాగునీటి కాలువకు నేటి నుంచి 30 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు జలాశయం ఏఈ జయరామ్ చెప్పారు. మరోవైపు ప్రస్తుతం ఎగువ ప్రాంతం నుంచి జలాశయాలోకి 30 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తి నీటిమట్టం 101.25 మీటర్లు కాగా, ప్రస్తుతం 94.35 మీటర్ల మేరకు ఉంది.

ABOUT THE AUTHOR

...view details