ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పన్నుల భారం వద్దు.. ఉత్తర్వులు ఉపసంహరించుకోండి' - cpm leaders protested in vishaka

ప్రజలపై భారాలు మోపే పట్టణ సంస్కరణలు వద్దంటూ.. విశాఖలో సీపీఎం ఆందోళన చేపట్టింది. తడి, పొడి చెత్తపై పన్ను... డ్రైనేజి చార్జీల భారం ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసింది.

CPM  protest  against the new urban reforms
నూతన పట్టణ సంస్కరణలకు వ్యతిరేకంగా ఆందోళన

By

Published : Dec 2, 2020, 1:50 PM IST

పట్టణ సంస్కరణలకు వ్యతిరేకంగా విశాఖలోని జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట సీపీఎం ఆందోళన చేపట్టింది. ఇంటి పన్నులు మార్కెట్ విలువ ఆధారంగా పెంచాలని నిర్ణయిస్తూ జీవోలు విడుదల చేయడాన్ని నేతలు విమర్శించారు.

నీటి చార్జీల పెంపు... తడి, పొడి చెత్తపై పన్ను... డ్రైనేజీ చార్జీల భారాలు మోపటంపై మండిపడ్డారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఉత్తర్వుల ప్రతులను దగ్ధం చేశారు. వెంటనే ఈ నిర్ణయాలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలో తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details