దీపావళి పండుగలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను ఇవ్వాలని సీపీఐ డిమాండ్ చేసింది. ఈ విషయం పై విశాఖలోని తహసీల్దారు కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వం, కోర్టు సాకులు చూపి పేదలకు ఇళ్ల పట్టాలను ఇవ్వడం లేదని ఆరోపించారు. దీపావళి లోపు అర్హత కలిగి లబ్ధిదారులకు స్థలం ఇవ్వాలని... లేని పక్షంలో ఉద్యమం ఉద్ధృతం చేస్తామని తెలిపారు.
దీపావళిలోపు లబ్దిదారులకు ఇళ్ల పట్టాలివ్వాలి: సీపీఐ - vishaka cpi leaders protest
దీపావళిలోపు ఎంపిక చేసిన లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను ఇవ్వాలని సీపీఐ డిమాండ్ చేసింది. కోర్టు సాకులు చూపి పేదలకు ఇళ్ల పట్టాలను ఇవ్వడం ప్రభుత్వం ఆపేసిందని ఆరోపించారు. దీపావళి లోపు అర్హత కలిగి ఎంపిక చేసిన లబ్దిదారులకు స్థలం ఇవ్వాలని కోరారు.
దీపావళిలోపు లబ్దిదారులకు డిమాండ్ ఇళ్ల పట్టాలని
నగర ప్రాంతాల్లో సెంటు, గ్రామీణ ప్రాంతంలో సెంటున్నర ఇవ్వాలనే ప్రభుత్వ ఆలోచన సరికాదని, మరింత భూమి పెంచి ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం స్పందించక పొతే తామే ప్రజలకు ఆ భూమి పంచుతానని హెచ్చరించారు.
ఇదీ చదవండీ...బన్ని ఉత్సవంపై ఉత్కంఠ.... ఓ వైపు ఆచారం, మరో ఆంక్షలు