ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొండను తొలిచి దారి నిర్మించుకున్న గిరిజనులు - manyam tribesmen built the road by digging the hill

ఆ గ్రామాలకి రహదారి లేదు. పక్క ఊర్లు వెళ్లలాంటే కొండ దాటాల్సిందే. ప్రజా ప్రతినిధులకు మొర పెట్టుకున్నా సమస్య తీరలేదు. చివరికి గిరిజనులే స్వయంగా కొండని తవ్వి రహదారి నిర్మించుకున్నారు.

vishaka district
కొండను దొలిచి దారి నిర్మించుకున్న గిరిజనులు

By

Published : Jul 16, 2020, 9:52 PM IST

విశాఖ మన్యం పరిధిలో.. అత్యంత మారుమూల ప్రాంతమైన జి.మాడుగుల మండలం బొయితలి పంచాయితీ పూతిక మెట్ట నుంచి.. మడతబంధ వరకు రహదారి మార్గం లేదు. గిరిజనులు అధికారులకు ప్రజాప్రతినిధులకు ఈ విషయమై ఇప్పటివరకు చాలా సార్లు విజ్ఞాపనలు ఇచ్చారు. అయినా రహదారి కల్పించలేదు. చేసేది లేక రెండు గ్రామాల గిరిజనులు సొంత కష్టాన్ని నమ్ముకుని కొండ మార్గంలో రహదారి తవ్వుకున్నారు.

రహదారికి మార్గం సుగమం చేసుకున్నారు. మహిళలు సైతం గునపాలు పట్టి కొండని తవ్వి రహదారి నిర్మాణంలో పాలుపంచుకుంటున్నారు. కొండ మధ్య భాగం తొలిచి బాట వేసుకునేందుకు సమిధలు అవుతున్నారు. గిరిజన గూడేల్లో పల్లెపల్లెకు రహదారులు రాజకీయ నాయకుల మాటలు పేపర్లకే పరిమితం అవుతున్నాయని.. అందుకే తామే ఇలా శ్రమించాల్సి వచ్చిందని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details