విశాఖ లోని బర్మాకాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీ, నడుపూరు, బాలచెరువు, బాబూజగ్జీవన్‌రామ్ కాలనీ, చినకోరాడ, డెయిరీకాలనీ, రిక్షాకాలనీలు ముంపునకు గురయ్యాయి. గంగవరం పోర్టు మార్గంలోని చాకలిగెడ్డను కప్పేసి విద్యుత్తు తీగల కోసం పైపులైను వేయటం వల్లే ఎగువ నుంచి వచ్చిన వరద నీరు కదలక ఈ సమస్య ఏర్పడిదని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ సహజ సిద్ధంగా ఉన్న గెడ్డను పూర్తిగా గ్రావెల్‌తో కప్పేసి చిన్న గొట్టాలు వేసి సంబంధిత గుత్తేదారు తప్పుకొన్నట్టు ఆరోపించారు.
సమస్యను ఉన్నతాధికారులు పరిశీలించారు. జీవీఎంసీ అనుమతి లేకుండా గెడ్డను మూసేశారని, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. రెండు జేసీబీలతో గెడ్డలో మట్టిని తీయిస్తామని హామీ ఇచ్చారు.