విశాఖ ఏజెన్సీలో చలి రోజురోజుకి పెరుగుతోంది. లంబసింగిలో 7 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతగా నమోదు కాగా, చింతపల్లిలో 8.5 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మన్యంలో అన్ని మండలాల్లో రెండు వారాలుగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం పూట అత్యధిక మంచు కురుస్తుండటంతో ప్రధాన రహదారుల మీద మంచుదుప్పటి కప్పుకుంది. వాహనాలు హెడ్‌లైట్లు వేసుకుని రాకపోకలు సాగిస్తున్నాయి. ఉదయం పది గంటలయినా మంచుతెరలు వీడకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.. విశాఖ ఏజెన్సీ చింతపల్లి మండలంలో చలి తీవ్రత పెరుగుతుండటంతో లంబసింగి, తాజంగి, చింతపల్లిలో మంచు అందాలను చూడటానికి పర్యటకులు వస్తున్నారు. మంచు సోయగాలతో విశాఖ మన్యం కొత్త అందాలతో అలరారుతోంది.
మంచును కప్పుకున్న విశాఖ మన్యం - విశాఖ ఏజెన్సీలో పెరిగిన చలి వార్తలు
విశాఖ ఏజెన్సీలో చలిపంజా విసురుతుంది. రోజుకు రోజుకు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో గిరిజనులు గజగజ వణుకుతున్నారు. ఆంధ్రా కశ్మీర్‌గా పేరుగాంచిన లంబసింగిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
![మంచును కప్పుకున్న విశాఖ మన్యం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5118370-471-5118370-1574223719396.jpg)
విశాఖ మంచు సోయగాలను ఆస్వాదిస్తున్న పర్యాటకులు
Last Updated : Dec 21, 2019, 11:39 AM IST