విశాఖపట్నం జిల్లా మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలం కోణం జలాశయం మన్యం ప్రాంతాన్ని ఆనుకోని ఉంది. జలాశయం అవతల ఉన్న పచ్చని కొండలకు మేఘాలు తాకినట్లు కనిపిస్తున్నాయి. ప్రకృతి ఒడిలో తేలియాడుతున్న మేఘాల ప్రతిబింబం జలాశయం నీటిలో అబ్బుర పరుస్తున్నాయి. కళ్లముందే మేఘాలు కదులుతున్నట్లు ప్రతిబింబ దృశ్యాలు అద్భుతంగా ఉన్నాయి. ప్రకృతి సృష్టించిన అందాలను ప్రకృతి ప్రేమికులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. వాటిని ఆసక్తిగా తిలకిస్తూ... మేఘాల అందానికి మంత్రముగ్ధులవుతున్నారు.
మేఘాలే తాకింది హై హైలెస్సా..! - చీడికాడ మండలం
ఆకాశంలో మేఘం చేతికందితే ఎంత బాగుంటుందో..అని ప్రకృతి ప్రేమికులు ఊహా లోకంలో విహరిస్తుంటారు. వారి ఉహను నిజం చేసేలా ఆకాశంలోని మేఘం నీటిపై తేలియాడుతూ...మంత్రముగ్ధులను చేసింది కోణం జలాశయం.
The clouds are reflected in the reservoir of water at konam in vishakapatnam district