ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చోడవరంలో వినాయకుడిని దర్శించుకున్న జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి - విశాఖ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి తాజా వార్తలు

జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి అవధానం హరి హరినాథ్ శర్మ చోడవరంలోని అసిస్టెంట్ సెషన్స్ కోర్టును సందర్శించారు. అంతకుముందు పట్టణంలోని స్వయంభూ వినాయక ఆలయాన్ని దర్శించి, ప్రత్యేక పూజలు చేశారు.

The Chief Justice of the District Court visited the Vinayaka Temple
వినాయక ఆలయాన్ని దర్శించిన జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి

By

Published : Jan 10, 2021, 5:58 PM IST

విశాఖ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి అవధానం హరి హరినాథ్ శర్మ చోడవరంలోని అసిస్టెంట్ సెషన్స్ కోర్టును సందర్శించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. కేసుల సత్వర పరిష్కారానికి న్యాయవాదులు సహకరించాలని ఆయన కోరారు. చోడవరం కోర్టులో కొత్తగా నిర్మించనున్న భవనాలకు హైకోర్టు నుంచి అనుమతి రాగానే నిర్మాణ పనులకు సంబంధించి శంకుస్థాపన చేపట్టనున్నట్లు తెలిపారు.

అంతకుముందు పట్టణంలోని స్వయంభూ వినాయక ఆలయాన్ని దర్శించి, వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట 9వ అదనపు జిల్లా జడ్జి చక్రపాణి, చోడవరం అసిస్టెంట్ సెషన్స్ కోర్టు జడ్జ్ రాజీవ్, పీడీఎం ఉమాదేవి ఉన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పోతుల ప్రకాష్ ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details