విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో పునరాలోచన ఏదీ లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. ఉక్కుపై ప్రైవేటీకరణలో రెండో ఆలోచన ఏమైనా ఉందా అని వైకాపా ఎంపీ మాధవ్ లోకసభలో అడిగిన ప్రశ్నకు.. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కిషన్ రావు కరద్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేయడమే కేంద్రం వద్ద ఉన్న ప్రత్యామ్నాయ మార్గం అని వెల్లడించారు.
Vishaka steel plant: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పునరాలోచన లేదు: కేంద్రం - లోక్‌సభ వార్తలు
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో పునరాలోచన ఏదీ లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం చేయడమే కేంద్రం వద్ద ఉన్న ప్రత్యామ్నాయ మార్గం అని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి తెలిపారు.
![Vishaka steel plant: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పునరాలోచన లేదు: కేంద్రం The Center has once again made it clear that there is no reconsideration of the privatization of the Visakhapatnam steel plant](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12577802-718-12577802-1627297569000.jpg)
స్టీల్ ప్లాంట్