సింహాచలం కొండపైకి మెట్ల మార్గంలో విస్తరణ పనులు జరుగుతున్నాయి. అటు వైపు పనులు జరుగుతున్నా... కనీసం హెచ్చరిక బోర్డు పెట్టలేదు అధికారులు. ఈ విషయం తెలియక కొండపైకి మెట్లు మార్గం ద్వారా భవానీ అనే మహిళ దర్శనానికి వెళుతుండగా...ప్రమాదవశాత్తు జారిపడటంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయంలో దేవస్థానం సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని...పనులు జరుగుతున్న సమయంలో తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు చేపట్టకపోవడం కారణంగానే తమ కుటుంబానికి ఈ నష్టం జరిగిందని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, గుత్తేదారు సంస్థ ప్రతినిధులు చనిపోయిన మహిళ ప్రాణానికి 6లక్షల రూపాయలు వెలగట్టారని...ఈ తరహా ఘటనలపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
సిబ్బంది నిర్లక్ష్యమే ఆమె ప్రాణం తీసింది
సింహాచలం కొండపైకి మెట్ల మార్గంలో వెళ్తున్న సమయంలో మృతి చెందిన మహిళ కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ విషయంలో దేవస్థానం సిబ్బందితో పాటు విస్తరణ పనులు చేస్తున్న వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధిత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యంగానే ఆమె ప్రాణం పోయింది