కొయ్యూరు మండలం డౌనూరు సమీపంలో కారు అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన యువకులు కారులో లంబసింగి పర్యటన ముగించుకొని తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో ఐదుగురు యువకులు స్వల్పంగా గాయపడ్డారు. వీరిని నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోయలోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురికి స్వల్ప గాయాలు - కొయ్యూరు ప్రమాదం
విశాఖ జిల్లా కొయ్యూరు మండలం డౌనూరు సమీపంలో కారు అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. లంబసింగి పర్యటనను ముగించుకుని తిరిగి వెళ్తున్న పర్యాటకులు.. ఈ ప్రమాదానికి గురయ్యారు.

విశాఖ కొయ్యూరుల వద్ద లోయలోకి దూసుకెళ్లిన కారు