విశాఖ శారదాపీఠంలో బ్రహ్మయజ్ఞం స్మార్త సభ జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి పురోహిత ప్రముఖులు హాజరయ్యారు. స్మార్తసభను ఉద్ధేశించి పీఠాధిపతులు స్వరూపనందేంద్ర ప్రసంగించారు. భారతావనిలో సర్వోన్నతమైన కులం బ్రాహ్మణ కులమని కొనియాడారు. అర్చకులు, వేదపండితుల జీవితాలు గాలిపటాల్లాంటివని..వారికి ఏదైనా జరిగితే ఆ కుటుంబాలను రక్షించాలన్నదే తన ఆలోచన అని స్వరూపానందేంద్ర తెలిపారు.
బ్రాహ్మణుల కులవృత్తిగా పౌరోహిత్యాన్ని గుర్తించాలన్నారు. అర్చకుల వేతనాలను రూ.15వేలకు పెంచేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని...కొంతమంది అధికారుల నిర్లక్ష్యం కారణంగానే జాప్యమవుతోందని స్వరూపానంద తెలిపారు. 'మీ హామీల కోసం నేను నిలబడతా...మీరంతా సంస్కారవంతంగా ఉండండి' అని భరోసా ఇచ్చారు.
ఆ కుటుంబాలను రక్షించాలన్నదే నా ఆలోచన: స్వరూపానందేంద్ర
అర్చకులు, వేదపండితుల జీవితాలు గాలిపటాల్లాంటివని..వారికి ఏదైనా జరిగితే ఆ కుటుంబాలను రక్షించాలన్నదే తన ఆలోచన అని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర తెలిపారు.
విశాఖ శారదాపీఠం ఆధ్వర్యంలో బ్రహ్మయజ్ఞం స్మార్తసభ