ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వ్యవసాయ బావిలో మునిగి బాలుడు మృతి

సరదాగా ఈత నేర్చుకుందామని మిగతా పిల్లలతో కలిసి ఆ బాలుడు వ్యవసాయ బావిలోకి దిగాడు. అయితే ఈత రాక అందులో మునిగి మృతి చెందాడు. ఈ విషాద ఘటన విశాఖ జిల్లా రాయుడుపాలెంలో జరిగింది.

boy tejus
వ్యవసాయ బావిలో మునిగి బాలుడు మృతి

By

Published : Dec 8, 2020, 9:20 PM IST

విశాఖ జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం మునగపాక మండలం రాయుడుపాలెంలో వ్యవసాయ బావిలో పడి బాలుడు మృతి చెందాడు. కరోనా కారణంగా విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడం లేదు. ఈ క్రమంలో గ్రామంలోని కొందరు పిల్లలు బావిలో ఈత నేర్చుకోవడానికి వెళ్లారు.

తేజస్ అనే బాలుడు ఈత రాక బావిలో మునిగి చనిపోయాడు. ఆ చిన్నారి మూడో తరగతి చదువుతున్నాడు. తేజస్ మృతితో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details