విశాఖ సాగర తీరంలో విషాదం జరిగింది. ఓ బాలుడు పుట్టినరోజు జరుపుకొందామని స్థానిక బాలురు పది మందికి పైగా కోస్టల్ బ్యాటరీ ఏరియా లో బీచ్ కి వెళ్లారు. ఆ బాలుడు పుట్టినరోజు సరదాగా సాగర స్నానం చేస్తూ జరుపుకొందామని భావించారు. ఒడ్డున స్నానాలు, చేస్తూ అడుకున్నారు. ఇద్దరు బాలురు మాత్రం సముద్రంలో కెరటాల మధ్య చిక్కుకున్నారు. తమ వద్ద ఉన్న బెండు ముక్కలతో కొంతసేపు దగ్గర తేలియాడారు. అయితే ఒక పెద్ద కెరటం రావడంతో రోహిత్, హర్షవర్ధన్ అనే ఇద్దరు మునిగి పోయారు. వీరిని సముద్రం లోపలికి లాగేసుకుంది.
ఈ క్రమంలో మిగిలిన వారు కేకలు పెట్టటంతో అక్కడే ఉన్న కొందరు మత్స్యకారులు వారిని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ ఉదయం ఇద్దరు బాలురు మృతదేహాలు తీరానికి సమీపంలో తేలియాడుతూ ఉండడం చూసి స్థానిక మత్స్యకారులు తీరానికి చేర్చారు. వారి వారి కుటుంబాల్లో ఈ పిల్లలు ఒక్కరే సంతానం కావటం తీవ్ర విషాదం నింపింది. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పోలీసుల గాలింపు చర్యలు ఏమీ లేవని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.