ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈ ప్రకృతి అందం.. కనుల విందు!

పచ్చని కొండలు మంచు దుప్పటిని కప్పుకొన్నాయి. ఓ వైపు పొగమంచు వణికిస్తుంటే ... మరో వైపు చల్లటి పవనాల సవ్వడి... వేణుగానంలా మదిని రంజింపజేస్తోంది . ప్రకృతి అందాలతో... నయనాలకు పసందైన విందును అందిస్తున్న..... ఈ అపురూప దృశ్యం సమ్మోహనపరుస్తోంది.

ప్రకృతి అందాలు
vishaka paderu

By

Published : Oct 11, 2020, 4:30 PM IST

Updated : Oct 11, 2020, 8:13 PM IST

ఏకధాటిగా కురిసిన వర్షాలకు పచ్చగా మారిన వనాన్ని... తెల్లటి మల్లెలు కప్పివేశాయేమో అన్నట్టుగా ఉంది. మరో వైపు కమ్మకొస్తున్న కారు మేఘాలు... చూపరులను కట్టిపడేస్తున్నాయి. విశాఖ ఏజెన్సీ పాడేరుకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న వంజంగి కొండల్లో ఈ అద్భుత సోయగం పర్యటకులను ఆకట్టుకుంటోంది.

లాక్​డౌన్​కు సడలింపులు ఇవ్వగా... వీక్షకులు ఈ సహజ సిద్ధ అందాలను సందర్శించేందుకు తరలి వస్తున్నారు. ఈ అద్భుత చిత్రాలను తమ చరవాణిలో బంధిస్తున్నారు. ప్రకృతి ఒడిలో సేదతీరుతున్నారు.

ప్రకృతి అందాలు
Last Updated : Oct 11, 2020, 8:13 PM IST

ABOUT THE AUTHOR

...view details