ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"మౌలిక వసతుల కల్పనలో ఏపీని అగ్ర స్థానంలో నిలుపుతాం" - mekapati goutham reddy

విదేశీ వాణిజ్యంపై దిల్లీలో కేంద్ర ప్రభుత్వం బోర్డ్ ఆఫ్ ట్రేడ్ పేరిట నిర్వహించిన సమావేశానికి మంత్రి మేకపాటి గౌతమ్​రెడ్డి హాజరయ్యారు. సులభతర వాణిజ్యంలో రాష్ట్రానికి వచ్చిన అవార్డును అందుకున్నారు. పాత ఐటీ విధానాలను ప్రక్షాళన చేసి విశాఖపట్నం కేంద్రంగా ఐటీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మేకపాటి స్పష్టం చేశారు.

minister

By

Published : Sep 13, 2019, 6:56 AM IST

కేంద్ర మంత్రి కిరణ్ రిజుజూతో మేకపాటి సమావేశం

మౌలిక వసతుల కల్పన రంగంలో ఏడాదిలోగా రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమస్థానంలో నిలుపుతామని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. దిల్లీలో విదేశీ వాణిజ్యంపై కేంద్రం నిర్వహించిన సమావేశంలో 'సులభతర వాణిజ్యం' విభాగంలో రాష్ట్రానికి వచ్చిన అవార్డు అందుకున్నారు. విశాఖ కేంద్రంగా ఐటీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వెల్లడించారు. కేంద్రం ఏర్పాటు చేయదలచిన ఆక్వా సర్టిఫికేషన్ ల్యాబ్​ను విశాఖ లేదా కాకినాడలో ఏర్పాటు చేయాలని కోరారు. పరిశ్రమల్లో జీఎస్​టీపై రాష్ట్రాలు రాయితీ కోరుతున్నాయన్న మంత్రి కేంద్రం విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని అన్నారు. 5 కీలక రంగాల్లో రాష్ట్రానికి కేంద్రం సాయం కావాలని కోరారు. అనంతరం కేంద్ర మంత్రి కిరణ్ రిజుజూతో సమావేశమైన మంత్రి గౌతం రెడ్డి రాష్ట్రంలో క్రీడా అకాడమీల ఏర్పాటుకు సహకరించాలని కోరారు. పర్వతారోహకుడు మల్లి మస్తాన్ రావు కుటుంబానికి పరిహారం అందకపోవటాన్ని మంత్రి ప్రస్తావించారు.

ABOUT THE AUTHOR

...view details