విశాఖ సముద్ర తీరంలో సందర్శకులను ఆకట్టుకునే విధంగా గుడారాలను ఏర్పాటు చేశారు. ఆర్కే బీచ్‌లోని ఇసుక తిన్నెలపై పర్యటకులు సేద తీరేందుకు రంగు రంగుల వస్త్రాలతో గుడారాలు తీర్చిదిద్దారు. జీవీఎంసీ అనుమతితో ఓ ప్రైవేటు సంస్థ వీటిని అందుబాటులోకి తెచ్చింది. గుడారాలను వినియోగించుకునే వారు గంటకు రూ.50 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈ గుడారాలను చూసేవారు ఆర్కే బీచ్.. గోవాను తలపిస్తోందని అంటున్నారు.
రంగురంగుల గుడారాలు.. గోవాలో కాదు మన విశాఖ బీచ్‌లోనే
విశాఖ బీచ్ గోవా బీచ్లాగానే కనిపించబోతోంది ఇకమీదట. ఎలా అంటారా.. సముద్ర అలలను చూస్తూ ఉండిపోయేలా.. సేద తీరడానికి పర్యటకుల కోసం గుడారాలను ఏర్పాటు చేస్తున్నారు. గోవా బీచ్‌లో ఎలా ఉన్నాయో...ఇప్పుడు మన దగ్గర కూడా అలానే ఉండబోతుంది. విశాఖ ఓ బీచ్‌లో ఇలా ఉందో మీరు చూస్తారా..!
విశాఖ బీచ్