పెళ్లిలు జరగాలన్నా, మరణించినా.. ఏ చిన్న కార్యక్రమాన్ని సందడిగా జరుపుకున్నా ముందుగా ఇంటికి వచ్చేది టెంట్ హౌస్ సామన్లే. కరోనా లాక్డౌన్ కారణంగా పెళ్లిళ్లు, ఫంక్షన్లు లేక టెంట్ హౌస్ బేరాలు కరవయ్యాయి. ఫలితంగా టెంట్ హౌస్ యాజమానులు, సిబ్బంది వీధిన పడ్డారు.
విశాఖ జిల్లాలో స్వయం కృషితో టెంట్ హౌస్ ఏర్పాటు చేసుకొని పదేళ్లుగా జీవనం సాగిస్తున్న సురఘష్ పరిస్థితిని లాక్డౌన్ ఒక్కసారిగా తారుమారు చేసింది. పూలు అమ్మినచోటే కట్టెలు అమ్మిన చందంగా టెంట్ హాస్ నడిపిన చోటే పళ్లు అమ్ముతున్నారు. చోడవరం, రావికమత, బుచ్చెయ్యపేట, కె.కోటపాడు, చీడికాడ, పాడేరు మండలాల్లో 185 మంది టెంట్ హౌస్, మైక్ అండ్ లైటింగ్ నిర్వహించుకుంటూ... జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం వీరంతా ప్రభుత్వం వైపు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు.