విశాఖ జిల్లా పురుషోత్తపురంలో నిర్మాణాల తొలగింపు ఉద్రిక్తతలకు దారితీసింది. వేపగుంట దేవస్థానం భూములను కాపాడేందుకు నిర్మాణాలను తొలగిస్తున్నామన్న సింహాచలం దేవస్థానం అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. పురుషోత్తపురం గ్రామకంఠంలో అప్పాయ్యమ్మ, నర్సమ్మ, కనకరాజులు ఇటీవల ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. సింహాచలం దేవస్థానం ఏఈవో ఆనంద్‌కుమార్ సిబ్బందితో వెళ్లి ఆ పనులు నిలిపేశారు.
పురుషోత్తపురంలో నిర్మాణాల తొలగింపులో ఉద్రిక్తత - purushottapuram latest news
విశాఖ జిల్లాలోని వేపగుంట దేవస్థానం భూములను కాపాడేందుకు నిర్మాణాలను తొలగిస్తున్న అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. పురుషోత్తపురం గ్రామకంఠంలో అప్పాయ్యమ్మ, నర్సమ్మ, కనకరాజులు ఇటీవల ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. సింహాచలం దేవస్థానం ఏఈవో ఆనంద్‌కుమార్ సిబ్బందితో వెళ్లి ఆ పనులు నిలిపేశారు.
విషయాన్ని బాధితులు ఎమ్మెల్యే అదీప్‌రాజ్ దృష్టికి తీసుకెళ్లగా నిర్మాణాలను ఆపొద్దని ఈవో సూర్యకళకు సూచించారు. పరిశీలించి చర్యలు తీసుకుంటామన్న ఆమె కొన్ని రోజులు నిర్మాణ పనులు ఆపాలని సూచించారు. కొన్ని రోజులు పనులు ఆపిన బాధితులు ఎమ్మెల్యే సూచనలతో మళ్లీ ప్రారంభించారు. ఈ క్రమంలోనే పనులను ఏఈవో ఆపేందుకు ప్రయత్నించడంతో నిర్మాణదారులతో పాటు స్థానికులు, వైకాపా నాయకులు వారిని అడ్డుకున్నారు. తిరిగి వెళ్తున్న అధికారులను చుట్టుముట్టిన స్థానికులు వారిని వెళ్లనివ్వలేదు. ఈవో వచ్చి తమకు సమాధానం చెప్పాలని పట్టుబట్టారు.
ఇదీ చదవండి