Tension at Visakhapatnam RK Beach: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో (Skill Development Case) చంద్రబాబును అక్రమంగా అరెస్టు (Chandrababu Naidu Arrest) చేశారంటూ రోడ్డెక్కుతున్న వారిపై పోలీసుల ఉక్కుపాదం మోపుతున్నారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ.. విశాఖ బీచ్‌లో నారీ మహిళా శక్తి ర్యాలీకి పిలుపునిచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు బీచ్ వద్ద భారీగా మోహరించారు. మహిళలు చేపట్టిన నారీశక్తి కార్యక్రమంపై పోలీసులు జులుం చూపించారు. ఆంక్షలు, అరెస్టులతో నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. నారీశక్తి కార్యక్రమానికి.. సాయంత్రం 5 గంటలకు మహిళలు పిలుపునివ్వగా.. పోలీసులు అప్రమత్తమయ్యారు.
2-3 గంటల ముందు నుంచే కీలక మహిళా నేతలను హౌస్ అరెస్టులు చేశారు. ఎవరినీ బయటకు రానీయకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పోలీసుల ఆంక్షల్ని ఛేదించుకుని చాలా మంది మహిళలు బీచ్ వద్దకు చేరుకుని నిరసనగా నడిచేందుకు సిద్ధమయ్యారు. అప్పటికే అక్కడికి చేరుకున్న సుమారు 500 మంది పోలీసులు ఎవరినీ నిరసనలు తెలపకుండా అడ్డుకున్నారు.
Thousands of women support Chandrababu in Anantapur హిందూపురంలో నారీ భేరీ.. బాబు అరెస్టుకు వ్యతిరేకంగా హిందూపురంలో పెద్దఎత్తున మహిళల నిరసన ర్యాలీ
బాబుకు మద్దతుగా నినాదాలు చేసిన మహిళలను అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. మహిళలను బలవంతంగా వాహనాల్లో ఎక్కించి స్టేషన్‌కు తరలించారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా లేదని మహిళలు నిలదీశారు. పోలీసుల తీరు వైసీపీ అరాచక పాలనకు ప్రతిరూపాలను మండిపడ్డారు.బీచ్ రోడ్డులో నిరసనగా నడిచేందుకు సిద్ధమైన మహిళల్ని పోలీసులు విచక్షణారహితంగా లాగిపాడేస్తూ వాహనాల్లోకి ఎక్కించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్నవారిని బలవంతంగా లాక్కెళ్లారు. ఈ క్రమంలో మహిళలు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మహిళలు మాట్లాడుతున్నా వినకుండా పోలీసులు వారిని లాక్కుంటూ తీసుకెళ్లారు.
Protests in Ananthpur Against CBN Arrest: అనంతలో రగిలిన నిరసన జ్వాలలు.. అరగుండు చేయించుకుని ఆందోళన
శాంతియుత నిరసనలనూ పోలీసులు అడ్డుకోవడాన్ని ఖండిస్తూ తెలుగుదేశం మహిళా కార్పొరేటర్.. ఎన్టీఆర్ విగ్రహం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. పోలీసులు విగ్రహం వద్దకు వెళ్లి ఆమెను బలవంతంగా వాహనంలోకి ఎక్కించారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఓ మహిళ మీడియాతో మాట్లాడుతుండగానే పోలీసులు ఆమెను మాట్లాడనీయకుండా లాక్కెళ్లారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వచ్చిన పెద్ద వయసు మహిళలనూ పోలీసులు వదల్లేదు. కనీసం మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా తోసుకుంటూ తీసుకెళ్లి వాహనాల్లోకి ఎక్కించారు.
పోలీసుల తీరుపై మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం మహిళలకు మద్దతు తెలిపేందుకు బీచ్ వద్దకు వచ్చిన జనసేన మహిళలనూ పోలీసులు అరెస్టు చేశారు. నిరసన తెలపకుండా అడ్డుకుని బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించారు. ఈ క్రమంలో తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. అడ్డుకోవడానికి వచ్చిన తెలుగుదేశం, జనసేన నాయకులు, కార్యకర్తలనూ పోలీసులు అదుపులోకి తీసుకుని వాహనాల్లో తరలించారు.
NRIs agitation against CBN Arrest: చంద్రబాబు అరెస్టుపై ఎన్ఆర్ఐల ఆగ్రహం.. టాంజానియాలో క్యాండిల్ ర్యాలీలు..
"నిరసన చేసే దానికంటే ఎక్కువ మంది పోలీసులు ఉన్నారు. కనీసం నడవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. మేము శాంతియుతంగా నడుద్దామని వచ్చాము. పోలీసులు బలవంతంగా ఎక్కిస్తున్నారు. వీరంతా ఈ ప్రభుత్వం ప్రతి రూపాలు". - టీడీపీ మహిళ
"చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసినందుకు బాధగా ఉంది. మా బాధని చెప్పుకునేందుకు వచ్చాము. అస్సలు మేము ఏ తప్పు చేశాము. మామూలుగా కూర్చున్నాము. బలవంతంగా తీసుకునిపోతున్నారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసనలు చేపట్టే హక్కు మాకు లేదా అని ప్రశ్నిస్తున్నాము". - టీడీపీ మహిళ
Protests for CBN in Canada and Bengaluru: అటు కెనడాలో.. ఇటు బెంగళూరులో..! బాబుకు మద్దతుగా కదంతొక్కిన తెలుగు ప్రజలు