Tension at Anakapalli in the wake of CM Jagan Tour: సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖ, అనకాపల్లి జిల్లాల పర్యటన సందర్భంగా పోలీసులు పలువురిని ముందస్తు గృహనిర్బంధం చేస్తున్నారు.
Tension at Anakapalli in the wake of CM Jagan Tour: సీఎం జగన్ పర్యటన వేళ.. పలువురు నేతల ముందస్తు గృహనిర్బంధాలు విశాఖలో పల్లా శ్రీనివాసరావు:సీఎం పర్యటన దృష్ట్యా ఎక్కడికక్కడ గృహనిర్బంధాలు చేస్తున్నారు. సమస్యలను సీఎం జగన్‌కు చెప్పేందుకు వెళ్తున్న వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. విశాఖలో టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావును, అదే విధంగా అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెంలో బండారు సత్యనారాయణమూర్తిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. అనకాపల్లి జిల్లా చోడవరం చక్కెర కర్మాగారం రైతుల బకాయి సొమ్మును విడుదల చెయ్యాలని ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్లబోతున్న జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీవీఎస్ఎన్ రాజుని అర్ధరాత్రి 12 గంటల సమయంలో కొత్తకోట గ్రామంలో వారి స్వగృహంలో గ్రామంలో పోలీసులు గృహనిర్బంధంచారు. చోడవరం చక్కెర కర్మాగారం రైతుల బకాయి సొమ్ము విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Police Restrictions to Public Due to CM Jagan Tour: సీఎం జగన్ పర్యటిస్తే చెట్లే కాదు.. దేవుడైనా పక్కకు జరగాల్సిందే..!
జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఇంటి వద్ద సైతం పోలీసులు మోహరించారు. సీఎం పర్యటన, ముందస్తు చర్యలో భాగంగా గృహ నిర్బంధించారు. తాడేపల్లి ప్యాలస్‌లో నుంచి సీఎం బయటకు వస్తే ప్రజలను, ప్రజా ప్రతినిధులను హౌస్ అరెస్టులు చేస్తారా అంటూ మూర్తి యాదవ్ ప్రశ్నించారు. సీఎం హెలికాప్టర్లో వెళ్తున్నా నేలపై పరదాలు పరుస్తారా..? అరాచక పాలనలో రాష్ట్రం మగ్గిపోతోందని మండిపడ్డారు.
IT Employees Faced Problems in CM Tour: అదే విధంగా ముఖ్యమంత్రి జగన్ పర్యటన సందర్భంగా ఐటీ ఉద్యోగులు సైతం ఇబ్బంది పడ్డారు. సీఎం విశాఖ విమానాశ్రయంలో దిగి నేరుగా ఐటీ హిల్స్ లో ఏర్పాటు చేసిన హెలిపాడ్ లో హెలికాప్టర్ దిగారు.. అక్కడి నుంచి పక్కనే ఉన్న ఇన్ఫోసిస్ కి ప్రారంభం కోసం వెళ్లారు. దీంతో ఉదయం నుంచి విధులకు హాజరు కావలసిన ఐటీ హిల్ నెంబర్ వన్ టూ త్రీ ఉద్యోగులు.. వారి కార్యాలయాలకు దూరంగా వాహనాలను నిలిపేసి నడుచుకుంటూ విధులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఐటీ ఉద్యోగులు ఇబ్బంది పడుతూనే విధులకు హాజరయ్యారు.
Restrictions during the CM visit in flood areas సీఎం జగన్ వరద ప్రాంతాల పర్యటనలోనూ.. కొనసాగిన ఆంక్షల పర్వం! అవస్థలు పడ్డ జనం!
Trees Cut Down for CM Jagan Tour: సీఎం జగన్ ఎక్కడ పర్యటించినా అక్కడి పచ్చదనంపై గొడ్డలి వేటుపడుతోంది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని లారస్ యూనిట్‌ను ప్రారంభించడానికి సీఎం వచ్చారు. హెలికాప్టర్లో వచ్చి.. ప్రారంభించిన యూనిట్‌కు ఎదురుగా నిర్మించిన హెలిప్యాడ్‌లో దిగారు. అయితే అధికారులు సెజ్ రోడ్ల పక్కనున్న వృక్షాలు, కొమ్మలను కొట్టేశారు.
పైగా సెజ్‌లో కొత్తగా ప్రారంభించనున్న యూనిట్‌కు కేవలం 500 మీటర్ల దూరంలో ఓ హెలిప్యాడ్ ఉండగా.. అది కాదని ప్రభుత్వ నిధులతో మరొకటి నిర్మించారు. అసలు విశాఖ విమానాశ్రయం నుంచి పరవాడ ఫార్మాసిటీకి కేవలం 30 కిలోమీటర్ల దూరమే అదే విధంగా.. పరవాడ నుంచి 10 కిమీ దూరంలో ఉన్న అచ్యుతాపురానికి సైతం హెలికాప్టర్‍నే సీఎం జగన్ నమ్ముకున్నారు. కాలు నేలపై పెట్టకుండా ఇలా గాల్లో వెళ్తే ప్రజలు ఇబ్బందులెలా తెలుస్తాయని స్ధానికులు చర్చించుకుటున్నారు.
CM Tour Restrictions: 11 గంటలకు సీఎం పర్యటన.. 7గంటలకే రోడ్లు బ్లాక్.. జనాలకు తప్పని ఇబ్బందులు