ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొవిషీల్డ్ వాక్సిన్ ట్రయల్స్ కోసం... తొలిరోజు 10మంది వాలంటీర్లు

విశాఖలోని కింగ్ జార్జి ఆసుపత్రిలో కొవిషీల్డ్ వాక్సిన్ మూడోదశ ట్రైయల్స్ కోసం... స్వచ్చందంగా ముందుకు వచ్చే వారి వివరాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలిరోజు 10మంది వాలంటీర్లు కొవిషీల్డ్ వాక్సిన్ ట్రయల్స్ కోసం నమోదు చేసుకున్నారు.

ten members have been registered for covishield vaccine trials in vishaka kgh
కొవిషీల్డ్ వాక్సిన్ ట్రయల్స్ కోసం... తొలిరోజు 10మంది వాలంటీర్లు నమోదు

By

Published : Oct 2, 2020, 7:13 PM IST

విశాఖలోని కింగ్ జార్జి ఆసుపత్రిలో కొవిషీల్డ్ వాక్సిన్ మూడోదశ ట్రైయల్స్ కోసం స్వచ్చందంగా ముందుకు వచ్చే వారి వివరాల నమోదు ప్రక్రియను ప్రారంభించారు. కొవిషీల్డ్ వాక్సిన్ కోసం కేజీహెచ్​లో 10 మంది వాలంటీర్లు ముందుకొచ్చారు. కనీసం మూడు వందల మంది వరకు నమోదుకు అవకాశం ఉంటుందని, ఇందులో 100 మందిని ఎంపిక చేసి వాక్సిన్ ఇస్తామని కేజీహెచ్ పర్యవేక్షకులు డాక్టర్ సుధాకర్ వెల్లడించారు. ఇప్పటికే వాక్సిన్ ట్రయల్స్​పై సీరం ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆసుపత్రి వైద్య బృందానికి అవగాహన కార్యక్రమాలను అన్​లైన్ ద్వారా పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details