ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాటుసారా పట్టివేత.. బెల్లం ఊట ధ్వంసం - విశాఖ జిల్లా సోంపురంలో నాటుసారా పట్టివేత

విశాఖ జిల్లా సోంపురం కూడలిలో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో 10 లీటర్ల నాటుసారా పట్టుబడింది. అనంతరం నిందితుడి సారా తయారీ స్థావరంపై దాడులు నిర్వహించి బెల్లం ఊటను ధ్వంసం చేశారు.

నాటుసారా పట్టివేత.. బెల్లం ఊట ధ్వంసం
నాటుసారా పట్టివేత.. 500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

By

Published : Dec 16, 2020, 7:46 PM IST

విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం సోంపురం కూడలిలో పోలీసులు తనిఖీ చేపట్టారు. కొత్తబొడ్డపాడు గ్రామానికి చెందిన ముసలి కన్నాలదొర నుంచి 10 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడికి చెందిన నాటుసారా తయారీ స్థావరంపై దాడులు జరిపారు. 500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించినట్లు ఎస్సై సింహాచలం తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details