Ganja Seized: గంజాయి తోటలు ధ్వంసం చేసి, అరికట్టాలని అధికారులు చెబుతున్నా అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. తాజాగా విశాఖ జిల్లా మాడుగుల మండలం గరికబంధ చెక్ పోస్ట్ వద్ద స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (S.E.B) నిర్వహించిన తనిఖీల్లో పెద్ద ఎత్తున గంజాయి దొరికింది. ఆటోలో తరలిస్తున్న రూ.10 లక్షల విలువైన 197 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని, అరెస్టు చేశారు. ఒక ఆటో, 4 బైకులు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఈబీ సీఐ సింహాద్రి తెలిపారు.
విశాఖలో 197 కేజీల గంజాయి పట్టివేత... ఐదుగురు అరెస్ట్ - special enforcement bureau in garikabandha checkpost
Ganja Seized: గంజాయి అణిచివేతకు పోలీసులు ఎంతగానో శ్రమిస్తోన్న ఫలితం లేకుండా పోతోంది. రోజుకి ఎక్కడో ఒకచోట పోలీసుల కళ్లు కప్పి అక్రమంగా సరుకు రవాణా చేస్తున్నారు. తాజాగా విశాఖ జిల్లా మాడుగుల మండలం గరికబంధ చెక్ పోస్ట్ వద్ద స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
విశాఖలోని గరికబంధ చెక్ పోస్ట్ 197 కేజీల గంజాయి పట్టివేత