ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఒక్కరి వల్ల.. కంటైన్​మెంట్ జోన్లుగా పది ప్రాంతాలు! - అనకాపల్లిలో పది ప్రాంతాలలో కంటైన్​మెంట్ జోన్లు

విశాఖ జిల్లా అనకాపల్లిలో కరోనా కేసులు పెరుగుతుండడంపై అధికారులు అప్రమత్తమయ్యారు. పట్టణంలోని ఒక ఎలక్ట్రానిక్ దుకాణంలో పనిచేసే వ్యక్తికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఫలితంగా... చుట్టుపక్కల ప్రాంతాలలో అధికారులు కంటైన్​మెంట్ జోన్లును ఏర్పాటుచేశారు.

Ten Areas as Containment Zones  in anakapalli
అనకాపల్లిలో పది ప్రాంతాలలో కంటైన్​మెంట్ జోన్లు

By

Published : Jun 7, 2020, 3:23 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లిలో కరోనా కేసులు పెరుగుతుండడంపై అధికారులు అప్రమత్తమయ్యారు. పట్టణంలోని ఒక ఎలక్ట్రానిక్ దుకాణంలో పనిచేసే వ్యక్తికి కోవిడ్ సోకగా.. అక్కడి పరిసర ప్రాంతాలను అధికారులు కంటైన్​మెంట్ జోన్లుగా ప్రకటించారు. లాక్​డౌన్ సడలింపులు అమలు చేస్తున్నందున..కేసులు మరింత పెరిగే అవకాశం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.

అనకాపల్లి పట్టణంలో గవరపాలెం, అనకాపల్లి, బౌలువాడ, బట్ల పూసి, సత్యనారాయణపురం, చినబాబు కాలనీ మొత్తం ప్రాంతాలను కంటైన్​మెంట్ జోన్​గా ప్రకటించారు. చింతవారి వీధి, గాంధీ బొమ్మ సెంటర్, సుంకరమెట్ట కూడలి ప్రాంతాల్లో పోలీసులు పహారా కాస్తున్నారు. కరోనా ప్రబలకుండా తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details