విశాఖ జిల్లా చోడవరం పరిసర గ్రామాల్లో ఉన్న గ్రామదేవతల ఆలయాలను దేవదాయ శాఖ పరిధిలోకి తీసుకొచ్చారు. ముత్యాలమ్మ (గోవిందమ్మకాలనీ), దుర్గాలమ్మ (చీడికాడ రోడ్డు), ముత్యాలమ్మ (తామరచెరువు), పరదేశిమ్మ (కోటవీధి), మావుళ్లమ్మ (అంకుపాలెం) గ్రామ దేవతల ఆలయాల బాధ్యత ఇక నుంచి దేవాదాయ శాఖ పర్యవేక్షిస్తుందని కార్యనిర్వహణాధికారి ఎన్.ఎల్.ఎన్.శాస్త్రి తెలిపారు. ఈ ఆలయాల నిర్వహణకు మూడున్నర ఎకరాల భూమి ఉందన్నారు. పట్టణంలోని స్వయంభూ గౌరీశ్వర ఆలయానికి చెందిన భూమిలో అక్రమంగా వెలిసిన దుకాణాలను దేవాదాయ శాఖ అధికారులు తొలగించారు.
ఇకపై దేవాదాయ శాఖ పరిధిలోకి గ్రామ దేవతల ఆలయాలు - విశాఖ జిల్లాలో గ్రామ దేవతల ఆలయాల తాజా వార్తలు
విశాఖలో పలు గ్రామ దేవతల ఆలయాలను దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు దేవాలయ భూముల్లో అక్రమంగా ఉన్న దుకాణాలను అధికారులు తొలిగించారు.

దేవాదాయ పరిధిలో గ్రామ దేవతల ఆలయాలు
TAGGED:
దేవాదాయ శాఖ తాజా వార్తలు