ఆలయాలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను విశాఖపట్నం పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ, విజయనగరం జిల్లాల్లోని మందిరాల్లో దోపిడీలు చేస్తున్న ఆరుగురిని అరెస్టు చేసినట్లు డీఐజీ రేంజ్ కే.వీ.రంగారావు వెల్లడించారు.
వీరి నుంచి రూ.ఇరవై ఒక్క వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మధురవాడ వాంబే కాలనీకి చెందినవారిగా గుర్తించారు. వారిపై 27 కేసులు విచారణలో ఉన్నట్టు డీఐజీ తెలిపారు.