విశాఖ మన్యం ప్రజల ఇలవేల్పు శ్రీ మోదకొండమ్మ తీర్థ మహోత్సవాలు పాడేరులో ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి దంపతులు పల్లకి మోసి ఉత్సవాలు ప్రారంభించారు. మోదకొండమ్మ గుడి నుంచి అంబేడ్కర్ సెంటర్ మీదుగా ప్రధాన రహదారి గుండా ఉత్సవ ర్యాలీ సాగింది. భక్తులు అమ్మవారి ఉత్సవ విగ్రహంతో ఊరేగింపులో పాల్గొన్నారు. డప్పు వాయిద్యాలు, నృత్యాలు, వివిధ వేషధారణలు ఆకట్టుకున్నాయి.
పాడేరులో మోదకొండమ్మ తీర్థ మహోత్సవాలు - పాడేరులో మోదకొండమ్మ తీర్థ మహోత్సవాలు
పాడేరులో శ్రీ మోదకొండమ్మ తల్లి అమ్మవారి తీర్థ మహోత్సవాలను ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి దంపతులు ప్రారంభించారు.
పాడేరులో మొదలైన మోదకొండమ్మ తీర్థ మహోత్సవాలు