ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాడేరును కమ్మేసిన పొగమంచు - temperatures down at paderu news

విశాఖ జిల్లా పాడేరులో చలి వణికిస్తోంది. దట్టంగా అలుముకున్న పొగమంచుతో ప్రకృతి శ్వేతవర్ణంలో మెరుస్తోంది. మంచు కారణంగా దారి కనిపించక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

snow
పొగమంచు

By

Published : Jan 16, 2021, 2:21 PM IST

మన్యం కేంద్రం పాడేరులో చలి తీవ్రత పెరిగింది. మినుములూరు కాఫీ తోటల వద్ద 11, పాడేరులో 13 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు దట్టంగా వ్యాపించటంతో రహదారులు కనిపించక వాహనచోదకులకు ఇక్కట్లు తప్పటం లేదు.

ప్రకృతిని మరింత అందంగా చూపిస్తున్న పొగమంచు.. చూపరులను కట్టిపడేస్తున్నా... శ్వాస సంబంధ సమస్యలు ఉన్నవారిని మాత్రం కాస్త కష్టపెడుతోంది. ఉన్ని దుస్తులు ధరిస్తే తప్ప బయటకు వెళ్లలేని పరిస్థితి. చలి మంటలు వేసుకుని ప్రజలు సేదతీరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details